ఎవ‌రు దొంగ‌? ఎవ‌రు పోలీసు?

ఏది మాయ‌? ఎవ‌రిది ధ‌ర్మం?

2010లో నా హోండా యాక్టివా స్యూట‌ర్‌ను మా ఇంటినుంచి దొంగ‌లు ఎత్తుకెళ్ళారు. ఏడాదిన్న‌ర త‌రువాత సైఫాబాద్ పోలీసులకు త‌నిఖీల్లో దొరికింది. దొరికిన‌ప్పుడు ఐడెంటిఫికేష‌న్ కోసం సైఫాబాద్ పోలీస్‌స్టేష‌న్‌కి వెళ్ళాను. ఛాసిస్‌/ ఇంజిన్ నెంబ‌ర్ స‌రిపోలాయి. బండి కూడా బావుంది. రేర్‌వ్యూ మిర్ర‌ర్స్‌, ఫుట్‌మ్యాట్‌, ఫ్రంట్ డిక్కీతో స‌హా అన్నీవున్నాయి. టైర్లు కూడా కొత్త‌గానే వున్నాయి. సీటు డిక్కీలో నా సీబుక్ (కార్డు) కూడా అంతేవుంది. ఆ బండిని కోర్టుకు స‌మ‌ర్పించి, ఇంటికి తెచ్చుకోవ‌డానికి రెండు నెల‌ల‌కు పైగా ప‌ట్టింది. కోర్టులో కూడా నానా ఇబ్బందులూ ప‌డాల్సివ‌చ్చింది.

ఇక సైఫాబాద్ పోలీస్‌స్టేష‌న్ నుంచి స్కూట‌ర్ తెచ్చుకునేప్పుడు చూస్తే … రేర్‌వ్యూ మిర్ర‌ర్ లేదు, ఫుట్‌మ్యాట్‌ లేదు, ఫ్రంట్ డిక్కీ లేదు. టైర్లు పాత‌వి.. పైగా చినిగిపోయిన‌వి వున్నాయి. సీబుక్ లేదు, అస‌లు బండి తాళాలే లేవన్నారు. ట్రాలీలో ఇంటికి తెచ్చుకోవాల్సివ‌చ్చింది. స‌ర్వీస్ కోసం ఇచ్చిన‌ప్పుడు చూస్తే బండిలో లీట‌రు దాకా పెట్రోలుంది, ఇంజ‌న్ ఆయిల్ కూడా తాజాగా నింపించిన‌ట్లే వుంది. అంటే .. దొంగ‌త‌నం చేసిన దొంగ బండిని చాలా జాగ్ర‌త్త‌గా వాడుకున్నాడు, అవ‌స‌ర‌మైన స‌ర్వీసింగ్‌లు కూడా చేయించుకున్నాడు. కానీ, దొంగ‌త‌నం జ‌రిగిన వ‌స్తువులు దొరికిన‌ప్పుడు వాటి య‌జ‌మానుల‌కు ఎంతో భ‌ద్రంగా అప్ప‌గించాల్సిన సైఫాబాద్‌ పోలీసులు మాత్రం త‌మ బాధ్య‌త‌ను మ‌ర్చిపోయారు. ఇప్పుడు దొంగ అని ఎవ‌ర్ని అనాలి? మూడేళ్ళుగా నాక‌ర్థం కాని చిక్కు ప్ర‌శ్న ఇది. 🙂 

ప్రకటనలు

1200 సంవ‌త్స‌రాల క్రిత‌మే భార‌తీయులు అంత‌రిక్ష ప్ర‌యోగాలు చేశారా?

1200 సంవ‌త్స‌రాల క్రిత‌మే భార‌తీయులు అంత‌రిక్ష ప్ర‌యోగాలు చేశారా? స‌్పేస్ క్రాఫ్ట్‌ల‌ను త‌యారుచేయ‌డానికి ఆనాడే వారు ఆఫ్రికా, లాటిన్ అమెరిక‌న్‌ల స‌హాయం తీసుకున్నారా? విజయ‌వంతంగా రాకెట్ల‌ను ప్ర‌యోగించారా? కొన్ని ప‌రిశోధ‌న‌లు దీనిని నిజ‌మేనంటున్నాయి. అందుకు కావ‌ల్సిన‌న్ని ఆధారాల‌నూ చూపిస్తున్నాయి. మ‌హాబ‌లిపురంలోని గ‌ణేశ ర‌థ‌, మ‌రికొన్ని క‌ట్ట‌డాల‌ను ఆధారం చేసుకుని తీసిన ఒక చిన్న డాక్యుమెంట‌రీని ఇక్క‌డ‌ చూడండి.