చిన్న‌న్న‌య్యా, అయామ్ వెరీ వెరీ సారీ !!

Oct 24, 2017

ఇవ్వాళ మ‌ధ్యాహ్నం మా చిన్న‌న్న‌య్య ఇంటికొచ్చాడు. నేను లోప‌లి గ‌దిలో కంప్యూట‌ర్ మీద నా ప‌ని నేను చేసుకుంటూవున్నా. సురేషూ అని న‌న్ను పిలిచేవుంటాడు కానీ, నాకు వినిపించ‌లేదు.

స‌రే, సొంత త‌మ్ముడిల్లే క‌దా అని స్వేచ్ఛ‌గా కిచెన్ లోకి వెళ్లి ఓ రెండు అర‌టిప‌ళ్లు తిన్నాడు. ఇంకో రెండు ప‌ళ్లు కూడా తిన‌డానికి ట్రై చేశాడు కానీ, మ‌రీ గ‌ట్టిగా వున్నాయేమో, వాటిని మెత్త‌గా పిసికి కింద ప‌డేశాడు. ప‌క్క‌నే డ‌బ్బాలో మొన్న‌నే ప్ర‌గ‌తిన‌గ‌ర్ సూప‌ర్‌మార్కెట్లో కొనుక్కొచ్చిన సుప్ర‌శ‌స్త‌మైన బూందీ, చేగోడీలున్నాయి. అవి క‌నిపించ‌లేద‌నుకుంటా … క‌నీసం ప‌చ్చిశ‌న‌గ‌లైనా తిందామ‌ని చూశాడు. డ‌బ్బా చేతిలోకి తీసుకుని హాల్లోకొచ్చాడు. బ‌హుశా మ‌ళ్లీ న‌న్ను పిలిచేవుంటాడు, నేను ప‌లికివుండ‌ను. కోప‌మొచ్చిన‌ట్లుంది, డ‌బ్బాను బాల్క‌నీలో విసిరికొట్టి వెళ్లిపోయాడు. త‌ర్వాతెప్పుడో నేను బ‌య‌టికొచ్చి … అయ్యో, చిన్న‌న్న‌య్య వ‌చ్చిన విష‌యం గ‌మ‌నించ‌లేదే అని చాలా బాధ‌ప‌డ్డాను.

చిన్న‌న్న‌య్యా, అయామ్ వెరీ వెరీ సారీ. ఏమీ అనుకోకు. ఇంకోసారి ఇలా చేయ‌ను. న‌న్ను క్ష‌మించి ఈ పోస్టు చ‌ద‌వ‌గానే మ‌నింటికొచ్చెయ్‌. ఫ్రెండ్స్‌, మా చిన్న‌న్న‌య్య మీలో ఎవ‌రికైనా క‌నిపిస్తే ద‌య‌చేసి నాకు ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఇవ్వండి. మీ ఆన‌వాలు కోసం మా చిన్న‌న్న‌య్య ఫొటో కింద లింక్‌లో పెడుతున్నాను. https://goo.gl/3zTqh2

Me too ! నేను కూడా !!

Oct 24 , 2018

అంద‌ర్లాగే నేను కూడా … నాకు చేతనైన ప‌నేదో జెన్యూన్‌గా చేసుకుంటూ బ‌తుకుతున్నాను. పాతికేళ్ల కెరియ‌ర్‌ను నాకు న‌చ్చిన‌ట్లుగా తీర్చిదిద్దుకున్నాను. నాకు ప‌నిచేయ‌డం తెలుసు; నా ప‌నికి అడ్డం ప‌డేవాళ్ల‌కు ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు. అన్ని ప‌నుల కంటే క్లిష్ట‌మైన వంట ప‌ని కూడా నాకు బాగా తెలుసు. అంతేకాదు, సంద‌ర్భానికి త‌గిన ఆయుధాల్ని ఎలా వాడాలో కూడా తెలుసు. ఎవ‌రి బ‌తుకులు వాళ్ల‌ను బ‌త‌క‌నిస్తే అంద‌రికీ ప్ర‌శాంతంగా వుంటుంది. Me too … మ‌హిళ‌ల‌కే కాదు, మ‌గ‌వాళ్ల‌కు కూడా ఈక్వ‌ల్‌గా వ‌ర్తిస్తుంది.