Green Books – Trissur

Sep 08, 2018

వ‌డ‌క్కునాథ‌న్ గుడినుంచి న‌డుచుకుంటూ వెన‌క్కొస్తున్న‌ప్పుడు క‌నిపించిందీ పుస్త‌కాల షాపు. గ్రీన్ బుక్స్ అన‌గానే వీళ్లు పాత‌పుస్త‌కాలు అమ్ముతారేమో అనుకున్నాను. అస‌లా అభిప్రాయంతోనే లోప‌లికి న‌డిచాను. తీరాచూస్తే బ్ర‌హ్మాండ‌మైన కొత్త‌పుస్త‌కాల బుక్‌షాప్‌. మేనేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్‌ను ప‌రిచ‌యం చేసుకున్నాం. బాగా రిసీవ్ చేసుకున్నారాయ‌న‌. గ్రీన్‌బుక్స్ ప‌బ్లిషింగ్‌లో కూడా వుంది. తెలుగు ప్ర‌జాగాయ‌కుడు గద్ద‌ర్ మీద మ‌ళ‌యాళంలో నేరుగా వ‌చ్చిన పుస్త‌కాన్ని వీరే ప‌బ్లిష్ చేశారు. అన్నిర‌కాల పుస్త‌కాలూ వున్నాయి కానీ, వామ‌ప‌క్ష సాహిత్యమే ఎక్కువ‌గా క‌నిపించింది. ఎంతైనా క‌మ్యూనిస్టు రాష్ట్రం క‌దా! మ‌రోసారి వెళ్లాల‌నుకున్నా కానీ, వీలుచిక్క‌లేదు.

#GreenBooks_Trissur

Bookshop from outside
Inside the book shop

వ్యాఖ్యానించండి