ఎల‌వారం అంటే ?

Sep 27, 2016

(Ref: My old post on the same day in 2014).

మా కాల‌నీ పార్కు ద‌గ్గ‌ర పోయినేడాది జ‌రిగిన సంఘ‌ట‌న‌లపై నాంప‌ల్లి 14వ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో సాక్షం చెప్ప‌డానికి వెళ్ళానివాళ‌. మేజిస్ట్రేట్ ముందు ఒక పెద్దావిడ నిల‌బ‌డి ఏదో చెబుతోంది. క్రాస్ ఎగ్జామినేష‌న్‌లో ఆమె ‘ఎల‌వారం’ అనే ప‌దం వాడింది. మేజిస్ట్రేట్‌కి ఆ ప‌దం అర్థం కాలేదు. ఎల‌వారం అంటే ఏమిటని ఆమెనే అడిగారు. ఆమె మ‌ళ్ళీ ఎల‌వారం అనే చెప్పింది. మ‌ళ్ళీమ‌ళ్ళీ అడిగినా ఆమె ‘ఎల‌వార‌మంటే ఎల‌వార‌మే’ అని చెప్పింది. మేజిస్ట్రేట్ చివ‌రికి ఏం అర్థం చేసుకున్నారో తెలీదు కానీ, త‌న నోట్స్‌ను టైప్ చేస్తున్న‌ అసిస్టెంట్‌కి డిక్టేట్ చేశారు. ఇంత‌కీ ఎల‌వారం అంటే ఏమిటి?

వ్యాఖ్యానించండి